ELR: చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలో ఎక్సైజ్ అధికారులు సోమవారం సారా కేంద్రాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడిలో పోతురాజు, మంగారావు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పది లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకొని, 200 లీటర్ల బెల్లపు ఉటను ధ్వంసం చేశారు. నిందితులపై కేసు నమోదుచేశామని సీఐ అశోక్ తెలిపారు.