TG: రాష్ట్రంలో మరో 4 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. ఈరోజు 9 జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కొమురంభీం, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌కు వర్ష సూచన కనిపిస్తోంది. నారాయణపేట జిల్లాలో అక్కడక్కడ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. గంటకు 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి.