ELR: ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి నిత్యాన్నదాన పథకానికి తణుకుకు చెందిన భక్తుడు వోలేటి నాగేంద్ర కృష్ణ రూ.లక్ష శనివారం విరాళంగా అందించారు. ముందుగా ఆయన సతీసమేతంగా స్వామి, అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం ఈ విరాళాన్ని ఆలయ కార్యాలయంలో జమ చేశారు. దాతకు ఆలయ సూపరింటెండెంట్ దుర్గాప్రసాద్ విరాళం బాండ్ పత్రాన్ని అందజేశారు.