ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో ప్రజలు శీతల పానీయాలు, ఐస్క్రీమ్ లు తినాలని అనుకుంటూ ఉంటారు. అంతేకాదు పెరుగు(curd), లస్సీకి కూడా డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అయితే..పెరుగును చక్కెర లేదా ఉప్పుతో కూడా తింటారు. అయితే ఈ రెంటిలో ఏది మంచిది.
వేసవి వచ్చిందంటే ప్రజలు తమ ఆహారంలో పెద్ద మార్పులు చేసుకుంటారు. వేసవిలో పెరుగు(curd) తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కాబట్టి చాలా మంది పెరుగు ఎక్కువగా తింటారు.
పెరుగును ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మూడుసార్లు సేవించవచ్చు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, పెరుగు కాల్షియం, ప్రోటీన్ , విటమిన్ల కు మంచి మూలం. దీన్ని ఉపయోగించడం వల్ల పొట్టకు సంబంధించిన అనేక సమస్యలు తొలగిపోతాయి. కానీ పెరుగు తినే విధానం ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. కొందరు పెరుగులో ఉప్పు కలిపి తింటారు. మరికొందరు పెరుగులో పంచదార(sugar) కలిపి తింటారు. పెరుగును ఉప్పు లేదా పంచదార కలిపి తినడం వల్ల కలిగే లాభాలు, నష్టాలు ఇక్కడ ఉన్నాయి.
పెరుగు , ఉప్పు:
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, పెరుగులో ఉప్పు(salt) కలిపి రోజువారీ తీసుకోవడం వల్ల వాత , కఫా సంబంధిత సమస్యలు పెరుగుతాయి. కాబట్టి దీనికి బదులుగా పెరుగును మజ్జిగ రూపంలో ఉప్పు కలిపి తాగవచ్చు.అయితే..పెరుగులో ఉప్పు కలిపి తింటే మధుమేహాన్ని దూరం చేసుకోవచ్చు. మరోవైపు అధిక రక్తపోటుతో బాధపడేవారు పెరుగులో ఉప్పు కలిపి తినకూడదు.
పెరుగు , చక్కెర:
చాలా మంది పెరుగులో చక్కెర(sugar) కలిపి తీసుకుంటారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, పెరుగులో చక్కెర కలిపి తీసుకోవడం వల్ల వేగంగా బరువు పెరుగుతారు. తద్వారా ఊబకాయం సమస్య తలెత్తుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు చక్కెరతో కూడిన పెరుగును తినకూడదు. అంతే కాకుండా, పెరుగు మరియు చక్కెర కలయిక అనేక సమస్యలను పరిష్కరిస్తుంది. పెరుగులో పంచదార కలుపుకుని తింటే కడుపు మంట, అసిడిటీ సమస్య తొలగిపోతుంది. పెరుగు , చక్కెర కడుపు జీర్ణవ్యవస్థను సరిచేస్తాయి.