కృష్ణా: గుడివాడలో మెడికల్ షాపు యజమానులకు మెడికల్ షాప్ డీలర్లకు నార్కోటిక్స్ డ్రగ్స్, యాంటీబయోటిక్స్ గురించి గురువారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మెడికల్ షాపు డీలర్లు గాని, యజమానులు గాని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ ఇవ్వకూడదని షాపు యజమానులు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు.