E.G: ‘స్వస్థ నారీ- సశక్త్ పరివార్’ అభియాన్ జిల్లా స్థాయి కార్యక్రమాన్ని బుధవారం రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రాజమండ్రి MP దగ్గుబాటి పురందేశ్వరి, కలెక్టర్ కీర్తి చేకూరి, ఎమ్మెల్యే నల్లమిల్లి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వస్థ నారీ- సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు కొనసాగుతుందన్నారు.