»Many Leaders Under The Leadership Of Kishan Reddy
BJP : కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు నేతలు కాషాయతీర్థం
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) ఆధ్వర్యంలో పలువురు నాయకులు బీజేపీ లో చేరారు. జూబ్లీహిల్స్‌కు చెందిన మహిళా పారిశ్రామికవేత్త జూటుర్ కీర్తిరెడ్డి(Jutur Kirti Reddy) కాషాయ కండువా కప్పుకున్నారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆశీర్వాదం తీసుకుని ర్యాలీగా ఆమె పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆపై కిషన్ రెడ్డి, పలువురు నేతల ఆధ్వర్యంలో పార్టీలో చేరారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) ఆధ్వర్యంలో పలువురు నాయకులు బీజేపీ లో చేరారు. జూబ్లీహిల్స్‌కు చెందిన మహిళా పారిశ్రామికవేత్త జూటుర్ కీర్తిరెడ్డి(Jutur Kirti Reddy) కాషాయ కండువా కప్పుకున్నారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆశీర్వాదం తీసుకుని ర్యాలీగా ఆమె పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆపై కిషన్ రెడ్డి, పలువురు నేతల ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఆమెతో పాటు మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీ సుభాషిన్ రెడ్డి(Justice B Subhasin Reddy) తనయుడు ఇంద్రసేనారెడ్డి సైతం కాషాయతీర్థం పుచ్చుకున్నారు. అంతేకాకుండా ఉద్యమకారుడు, టీజేఎస్ నేత గంగపురం వెంకట్ రెడ్డి సైతం బీజేపీలో చేరారు. సికింద్రాబాద్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అదం విజయ్ కుమార్ (Adam vijay kumar)సైతం పార్టీలో చేరారు. ఎన్నికల ఏడాది కావడంతో పార్టీలు చేరికలపై దృష్టి సారించాయి. గతంలో మునుగోడు ఉప ఎన్నిక సమయంలో మందగించిన చేరికల పర్వం తాజాగా మరోసారి ఊపందుకుంటోంది. కలిసి వచ్చే నేతల కోసం ప్రధాన పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి.
ఈ క్రమంలో బీజేపీలోకి నేతలు వరుసగా వచ్చి చేరుతున్నారు. తాజాగా టీజేఎస్ (TJS) ను వీడిన వెంకట్ రెడ్డి, దివంగత హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కుమారుడు ఇంద్రసేనా రెడ్డి, మహిళా పారిశ్రామిక వేత్త జుటుర్ కీర్తిరెడ్డి, అదం విజయ్ కుమార్ లు శుక్రవారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. మరో వైపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా పని చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి (Nallari Kiran Kumar Reddy) ఢిల్లీలో ఇవాళే కాషాయ కండువా కప్పుకున్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీలోకి చేరికల పర్వం ఆసక్తిని పెంచుతుంది. అయితే ఓ వైపు బీజేపీ, కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తున్న సమయంలో రాష్ట్రంలోని నేతలన తమ వైపు తిప్పుకోవాల్సిన కేసీఆర్ మాత్రం ఇక్కడి నేతలను వదిలేసి పొరుగున ఉన్న మహారాష్ట్ర(Maharashtra), ఇతర రాష్ట్రాల నేతలకు కండువాలు కప్పడంలో బీజీగా ఉంటున్నారు.
ఇటీవల మహారాష్ట్రకు చెందిన పలువురు రైతు సంఘాల నాయకులను బీఆర్ఎస్ (BRS) లో చేర్చుకున్నారు. దీంతో తెలంగాణను వదిలేసి పొరుగు రాష్ట్రాల నేతలపై పోకస్ పెట్టడం వల్ల అసలుకే ఎసరు రాదా అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో తెలంగాణలో తిరిగి పునరుత్తేజం కావాలని చూస్తున్న టీటీడీపీ(TTDP)సైతం చేరికలపై దృష్టి సారించింది. గతంలో టీడీపీ తరపున ఎమ్మెల్యేకు పోటీ చేసి అనంతరం బీఆర్ఎస్ లో చేరిన కూన వెంకటేష్ గౌడ్(Koona Venkatesh Goud) గులాబీ పార్టీకి షాకిచ్చారు. పార్టీలో సరైన గుర్తింపు లేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. త్వరలో టీడీపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. దీంతో రాబోయో రోజుల్లో పార్టీల మధ్య చేరికలు ఏ మేరకు స్పీడందుకోబోతున్నాయనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.
హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుభాషణ్ రెడ్డి గారి కుమారుడు శ్రీ ఇంద్రసేనా రెడ్డి, సామాజికవేత్త శ్రీమతి కీర్తిరెడ్డి, సికింద్రాబాద్ సీనియర్ నాయకుడు శ్రీ ఆదం విజయకుమార్, TJS నాయకులు ప్రొఫెసర్ గంగాపురం వెంకటరెడ్డితోపాటు వీరి అనుచరులు పెద్దసంఖ్యలో ఇవాళ బీజేపీలో చేరారు. pic.twitter.com/DXbd01PXKf