ADB: మహారాష్ట్రలోని చందాపూర్ గ్రామంలో గల గులాబ్ సింగ్ మహారాజ్ సన్నిధానాన్ని దర్శించుకున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదివారం సందర్శించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. గులాబ్ సింగ్ మహారాజ్ ఆధ్యాత్మిక ప్రవచనాలు అందరికీ ఆదర్శప్రాయమని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. ఆయన చూపించిన భక్తి మార్గంలో పయనించాలని కోరారు.