VZM: పీడీఎస్ (రేషన్ బియ్యం) బియ్యాన్ని అమ్మినా, అక్రమంగా తరలించినా చట్టపరమైన చర్యలు తప్పవని గంట్యాడ సీఎస్ డీటీ మూర్తి అన్నారు. సోమవారం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ.. రేషన్ డీలర్లు సమయపాలన పాటించి కార్డుదారులకు సరుకులు సరఫరా చేయాలని సూచించారు. ప్రతి నెల ఒకటో తేదీ నుండి 15వ తేదీ వరకు రేషన్ సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.