»Sp Charan Song Launch From Annapurna Photo Studio
అన్నపూర్ణ ఫొటో స్టూడియో’ నుంచి ఎస్పీ చరణ్ పాట లాంచ్!
హీరో చైతన్యరావు(Chaitanya Rao)... లావణ్య లక్ష్మి జంటగా నటించిన ఈ సినిమా నుంచి, తాజాగా రంగమ్మా...రంగమ్మా (Rangamma...Rangamma) అనే పస్టు సింగిల్‌ను ప్రియదర్మితో విడుదల చేయించారు.'కంటిచూపు నిన్నుతాకి పోనంటుందమ్మా .. కొంటె ఆశలేవో రేగి అదిరిందే బొమ్మ ..' అంటూ ఈ పాట సాగుతోంది. ప్రిన్స్ హెన్రీ (Prince Henry) సంగీతాన్ని అందించిన ఈ పాటకి శ్రీనివాస మౌళి సాహిత్యాన్ని అందించగా, ఎస్పీ చరణ్(SP Charan) ఆలపించారు.
హీరో చైతన్యరావు(Chaitanya Rao)… లావణ్య లక్ష్మి జంటగా నటించిన ఈ సినిమా నుంచి, తాజాగా రంగమ్మా…రంగమ్మా (Rangamma…Rangamma) అనే పస్టు సింగిల్‌ను ప్రియదర్మితో విడుదల చేయించారు.’కంటిచూపు నిన్నుతాకి పోనంటుందమ్మా .. కొంటె ఆశలేవో రేగి అదిరిందే బొమ్మ ..’ అంటూ ఈ పాట సాగుతోంది. ప్రిన్స్ హెన్రీ (Prince Henry) సంగీతాన్ని అందించిన ఈ పాటకి శ్రీనివాస మౌళి సాహిత్యాన్ని అందించగా, ఎస్పీ చరణ్(SP Charan) ఆలపించారు. ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలే అయినా ఆసక్తికరమైన కంటెంట్ తో ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా చాలా కథలు 1980 నేపథ్యంలో నడుస్తున్నాయి. అలాంటి ఒక సినిమాగా ప్రేక్షకుల ముందుకు రావడానికి, ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో(Annapurna Photo Studio)’ రెడీ అవుతోంది. ‘ఇచ్చట ఫొటోలు అందంగా తీయబడును’ అనేది ట్యాగ్ లైన్. ఈ పాట కూడా 1980 నేపథ్యంలో నడుస్తోంది. ఆ కాలం నటి కాస్ట్యూమ్స్ తోనే హీరో .. హీరోయిన్స్ ఇద్దరూ కనిపిస్తున్నారు. ఈ పాటను చూస్తుంటే ఒకప్పటి జంధ్యాల సినిమాలలోని పాటలు గుర్తుకొస్తున్నాయి. ఆ తరహాలోనే ఈ పాటను చిత్రీకరించారు. యశ్ రంగినేని (Yash Rangineni) నిర్మిస్తున్న ఈ సినిమాకి, చందూ ముద్దు దర్శకత్వం వహించాడు.