NZB: నగరంలో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో సీపీ కార్యాలయంల ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. సీపీ సాయిచైతన్య ఈ సందర్భంగా ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుదారుల సమస్యలను తెలుసుకుని చట్టపరంగా వాటికి పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడారు.