KMR: తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్ష అనుభవించక తప్పదని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర అన్నారు. మాచారెడ్డి మండలంలోని నెమ్మిలిగుట్ట తండాకు చెందిన జెరుపుల నవీన్ వయస్సు (24) తన వదిన జెరుపుల సంకి వేరే వారితో సన్నిహితంగా ఉంటుందని అనుమానంతో 2017 ఫిబ్రవరి 24 న మాంసం కోసే కత్తితో ఆమెను పొడిచి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ కేసులో ఆ వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష పడినట్లు వెల్లడించాడు.