VSP: మాజీ సీఎం వైఎస్ జగన్కు భద్రత కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైసీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ అన్నారు. సోమవారం సాయంత్రం వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కనీసం పోలీస్ ఎస్కార్ట్, రోప్ పార్టీలను జగన్కు ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోందని మండిపడ్డారు. ప్రమాదవశాత్తు జరిగిన ఘటనను జగన్కు ఆపాదించడం సరికాదన్నారు.