PDPL: జిల్లాలలోని పేదల సొంత ఇంటి కల నెరవేరుస్తున్నామని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి మండలంలోని పెద్దకల్వల, పెద్ద బొంకూరు, దస్తగిరి పల్లె గ్రామాలలో రూ. 69 లక్షలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలను అందజేశారు. నియోజకవర్గంలో 3500 ఇండ్లు మంజూరుయ్యాయని తెలిపారు.