HYD: గోల్కొండ బోనాల ఉత్సవాలకు హాజరుకావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని గోల్కొండ బోనాల కమిటీ సభ్యులు ఆహ్వానం అందించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు అంకితమైన గోల్కొండ బోనాల పండుగను ఘనంగా నిర్వహించేందుకు కమిటీ చేస్తున్న ప్రయత్నాలను మంత్రి అభినందించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరికీ శాంతి, సమృద్ధి కలగాలని మంత్రి కోరారు.