NLR: నగరంలోని వీఆర్ ప్రభుత్వ పాఠశాలను మంత్రి పొంగూరు నారాయణ, ఏపీ వక్స్బోర్డు ఛైర్మన్ అబ్దుల్ అజీజ్, నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిలు పరిశీలించారు. అజీజ్ మాట్లాడుతూ.. మంత్రి చేసిన పని ప్రభుత్వ పాఠశాలల్లో ఒక విప్లవమని కొనియాడారు. పేదవారికి అత్యున్నత స్థాయి విద్యను అందించాలని చదువు లేక వెనకబడ్డామన్నఆలోచన ఏ ఒక్కరికి రాకూడదని అన్నారు.