NZB: జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర సోమవారం తన కార్యాలయంలో మాట్లాడుతూ.. మహిళలు, చిన్నారులకు భరోసా కేంద్రం అండగా నిలుస్తోందని తెలిపారు. కామారెడ్డి జిల్లాలో పోక్సో కేసులలో బాధితులైన ఇద్దరికి ఆర్థిక సహాయ చెక్కులను ఎస్పీ అందజేశారు. బాధిత మహిళలు, చిన్నారులకు న్యాయం, భద్రత, మనోధైర్యం కల్పించే లక్ష్యంతో భరోసా కేంద్రం విశ్వసనీయంగా సేవలందిస్తోందని ఆయన అన్నారు.