అల్లూరి: కొయ్యూరు మండలం బూదరాళ్ల నుంచి జీకేవీధి మండలం పెదవలస వెళ్లే రహదారి మధ్యలో ఉన్న బొంతువలస ఘాట్ రోడ్డులో ఓ భారీ లారీ అడ్డంగా నిలిచిపోయింది. ఆ మార్గంలో వెళుతున్న ఓ భారీ లారీ, రోడ్డు ఇరుకుగా ఉండడం వల్ల ఘాట్ మలుపు వద్ద అడ్డంగా ఆగిపోయింది. దీంతో బైక్లు తప్ప ఆటోలు, కార్లు ఆ మార్గంలో తిరగడం లేదు. వాహనాన్ని వెంటనే తొలగించాలని సోమవారం పలువురు కోరుతున్నారు.