JGL: నేటి నుంచి ఈనెల 26 వరకు రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ స్పందన తెలిపారు. ఇవాళ ఎస్టీ, మైనార్టీ, క్రిస్టియన్, ఈబీసీలకు, 25న ఎస్సీ కార్పొరేషన్, 26న బీసీ కార్పొరేషన్ దరఖాస్తుదారులకు మున్సిపల్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. దరఖాస్తుదారులు పూర్తి డాక్యుమెంట్స్‌తో హాజరుకావాలని సూచించారు.