ఇవాళ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు 83వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. 1975లో ‘బాబు’ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయన.. 100కుపైగా సినిమాలకు దర్శకత్వం వహించి సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వెంకటేష్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలను ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఎన్నో అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు.