KMR: దోమకొండ మండలం లింగుపల్లి శివారులో బుధవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. ఎస్సై స్రవంతి ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. బిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామానికి చెందిన బెస్త సురేశ్(45)గా గుర్తించారు. సురేశ్‌కు మతిస్థిమితం సరిగా లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు చెప్పారు.