BDK:పేద ప్రజలకు అండగా ఎర్ర జెండా నిరంతరం పని చేస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బి. అయోధ్య అన్నారు. ఆదివారం మణుగూరు సమితి సింగారంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. పేద ప్రజల హక్కుల కోసం సీపీఐ పోరాడుతుందని చెప్పారు. పేద ప్రజలకు, ప్రజా పోరాటాలకు ఎర్రజెండా దిక్సూచి అని తెలిపారు. మణుగూరు అభివృద్ధిలో సీపీఐ పాత్ర మరువలేనిదన్నారు.