AKP: రోలుగుంట మండలం బుచ్చంపేట పీహెచ్సీ పరిధిలో పిత్రుగెడ్డలో శనివారం ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సూపర్ వైజర్ రమణ తమ సిబ్బందితో కలిసి గ్రామస్థులు రక్త పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. సీజనల్ వ్యాధుల ప్రభావితం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాచి చల్లార్చిన నీటిని తాగాలని చెప్పారు.