BDK: భద్రాచలంలో స్వసక్తితో చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పుకొని జీవనోపాధి పొందుతున్న గిరిజన మహిళలకు ఐటీడీఏవో, ఐటీసీ ద్వారా చేయూత అందించి వారి పరిశ్రమలను అభివృద్ధి దిశగా తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తున్నామని ప్రాజెక్టు పీవో బి. రాహుల్ అన్నారు. ఈ సందర్భంగా గిరిజన మహిళలు తయారు చేస్తున్న వివిధ రకాల తినుబండారాల పదార్థాలను ఆయన శనివారం పరిశీలించారు.