SRD: సిర్గాపూర్ మండలం వాసర్ ZPHSలో విధులు నిర్వహిస్తున్న హిందీ పండిత్ వెంకట్ రామ్ గుండెపోటుతో మృతి చెందారు. ఆదివారం తుల్జాపూర్ భవాని మాత దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా హఠాత్తుగా ఛాతిలో నొప్పి రావడంతో పరిస్థితి విషమించి మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. ఖేడ్ పట్టణంలోని నెహ్రు నగర్ ఆయన స్వగృహంలో సోమవారం అంత్యక్రియలు జరుగుతాయని చెప్పారు.