కోనసీమ: మండల కేంద్రం అయిన రావులపాలెంలోని సత్య సాయి సేవ కేంద్రంలో మంగళవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 9 గంటలు నుంచి ఉచిత కంటి, ఆయుర్వేద వైద్య శిబిరం మధ్యాహం 3 గంటలు నుంచి చెవి ముక్కు గొంతు, చిన్న పిల్లల వ్యాధులకు చికిత్స అందించనున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.