NLG: జిల్లాకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోమవారం రానున్నారు. బక్కతాయికుంట, కంచనపల్లి, దోమలపల్లి, పొనుగోడు గ్రామాల్లో రూ.44 కోట్లతో చేపట్టే లిఫ్టు ఇరిగేషన్ పనులకు, రూ.36 కోట్లతో కలెక్టరేట్లో అదనపు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. దీనికిముందు మర్రిగూడ బైపాస్ నుంచి ఒక్కతాయికుంట వరకు అక్కడి నుంచి కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు.