KKD: కాకినాడ YSR బ్రిడ్జిపై సోమవారం ఉదయం ప్రయాణిస్తున్న బ్యాటరీ వాహనం దగ్ధమైంది. ఒక్కసారిగా మంటలు రావడంతో వాహనంపై ప్రయాణిస్తున్న వారు బండిని అక్కడే వదిలేశారు. వాహనం మొత్తం పూర్తిగా మంటలో కాలిపోయింది. దీంతో బ్రిడ్జిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.