సత్యసాయి: జిల్లా కలెక్టరేట్ ఎదుట మే 5న పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఎం ధర్నా నిర్వహించనుంది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ఈఎస్ వెంకటేష్ మాట్లాడుతూ.. టిట్కో ఇండ్ల నిర్మాణాలు పూర్తిచేసి లబ్ధిదారులకు వెంటనే అప్పగించాలన్నారు. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు స్థలాలు కేటాయించి గృహాలు నిర్మించాలని డిమాండ్ చేశారు.