ADB: జిల్లా కలెక్టర్ రాజర్షి షాను 2024 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ట్రైనీ కలెక్టర్ సలోని చాబ్రా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా స్థితిగతులు, ప్రజలకు అందజేస్తున్న సంక్షేమ పథకాలు, పలు అంశాలను కాసేపు చర్చించారు. జిల్లాలో ట్రైనీ కలెక్టర్ గా పనిచేసే అవకాశం రావడం ఆనందంగా ఉందని ఆమె పేర్కొన్నారు.