సత్యసాయి: హైదరాబాద్ నిజాంపేటకు చెందిన మురళీ కృష్ణ, శివ ప్రసాద్.. మంత్రి సవితను కలిశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తలసేమియా బాధితులకు సహాయంగా తమ వంతు రూ. లక్ష విరాళం ప్రకటించారు. ఆ మొత్తాన్ని మంత్రి సవితను కలిసి అందజేశారు. ఆమె మాట్లాడుతూ.. తలసేమియా బాధితుల కోసం విరాళం అందజేయడం గొప్ప విషయమని కొనియాడారు.