బీహార్ దర్భంగలో షాకింగ్ ఘటన జరిగింది. ముగ్గురు పిల్లల తల్లి తన మరదలిని రహస్యంగా పెళ్లి చేసుకుంది. 11 ఏళ్ల క్రితం కృష్ణను పెళ్లి చేసుకున్న క్రితి.. ఇటీవల మైనర్ అయిన తన మరదలితో స్వలింగ సంబంధం పెట్టుకుంది. విషయం తెలుసుకున్న భర్త మందలించినా తన సంబంధాన్ని కొనసాగించింది. తాజాగా వీరిద్దరూ పారిపోవడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే వారు పెళ్లి చేసుకున్నారు.