ATP: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా భువనేశ్వర్-యశ్వంతపూర్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. మే 24వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయని పేర్కొంది. జిల్లాలోని ధర్మవరం, ప్రశాంతి నిలయం, హిందూపురం రైల్వే స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయని తెలిపింది.