కడప: జిల్లా పరిధిలో పది మంది ఎస్సైలను బదిలీలు చేస్తూ కర్నూల్ డీఐజీ కోయ ప్రవీణ్ ఉత్తర్వులను మంగళవారం జారీ చేశారు. కడప జిల్లాలో పని చేస్తున్న ఎస్సైలు ప్రతాప్ రెడ్డి, జయరాములు, సునీల్ కుమార్ రెడ్డి, హనుమంతు, యోగేంద్ర, రాజు, వెంకట సురేష్, శివప్రసాద్, చంద్రశేఖర్, కృష్ణయ్యలను బదిలీ చేశారు. పరిపాలన సౌలభ్యం కోసం బదిలీలు చేపట్టినట్లు డీఐజీ పేర్కొన్నారు.