TPT: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతుందని సమాచారం. కంపార్ట్మెంట్లన్ని నిండి కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 78,821 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,568 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీకి రూ. 3.36 కోట్ల ఆదాయం వచ్చింది.