KMR: లింగంపేట్‌లో సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణానికి గురువారం బీజేపీ రాష్ట్ర నాయకులు, ప్రముఖ పారిశ్రామికవేత్త, జపాన్ సైంటిస్ట్ పైడి ఎల్లారెడ్డి రూ.లక్ష విరాళంగా అందజేశారు. అలాగే గుడిలో అన్నదాన కార్యక్రమానికి క్వింట బియ్యం అందించారు. గ్రామస్తులు మాట్లాడుతూ.. పైడి ఎల్లారెడ్డి మంచి మనసు కలిగిన వ్యక్తిగా మా మధ్యలో ఉండడం మా అదృష్టమని అన్నారు.