ADB: ఉట్నూర్ మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో పీఓ ఖుష్బూ గుప్తాను CITU జిల్లా ప్రధాన కార్యదర్శి కిరణ్, ANMలతో కలిసి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్న ఏఎన్ఎంలకు పూర్తిస్థాయిలో వేతనాలు చెల్లించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. వారి సమస్యలు పరిష్కరించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.