MBNR: మిడ్జిల్ మండలం బోయిన్పల్లిలో దివ్యాంగులు, వృద్ధులు, వితంతువుల పెన్షన్లపై సమావేశం జరిగింది. MRPS జాతీయ అధికార ప్రతినిధి భిక్షపతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. దివ్యాంగులకు రూ. 6 వేలు, వృద్ధులకు, వితంతువులకు రూ. 4 వేలు పెన్షన్ పెంచాలని ఆయన కోరారు.