E.G: రాజమండ్రిలోని ఆల్కట్ గార్డెన్స్ సమీపంలో ఉన్న నగరపాలక సంస్థ హోమియో వైద్యశాలను జిల్లా కలెక్టర్, కమిషనర్ పి.ప్రశాంతి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఓ.పి సేవలు, మందుల నిల్వలు, అందుతున్న వైద్య సేవలపై సమీక్షించారు. డాక్టర్లు ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉండాలని, అవసరమై మందులు తక్షణం అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.