NLR: ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను మోసం చేస్తే క్రిమినల్ కేసులు తప్పవని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి హెచ్చరించారు. మంగళవారం పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రైతులకు షెడ్యూలింగ్ గురించి క్లుప్తంగా వివరించారు.