MLG: పురుగుల మందు తాగి ఓ ఆత్మహత్య చేసుకున్న ఘటన వెంకటాపురం మండలం బెస్తగూడెం గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. రామెళ్ల సతీష్ (39) అనే వ్యక్తి మిర్చి సాగు పంటలో పెట్టిన పెట్టుబడులు తిరిగి రావడం లేదనే మనస్థాపంతో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మరణ వార్త విన్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నేరు అయ్యారు.