సత్యసాయి: కదిరిలో ఈ నెల 20న ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మ రథోత్సవం జరగనుంది. ఈ రథోత్సవానికి 700 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నట్లు కదిరి టౌన్ సీఐ నారాయణరెడ్డి తెలిపారు. రథోత్సవం రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టామని అన్నారు.