TG: ప్రజల కష్టాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా లేదని BRS ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. ‘రుణమాఫీపై చర్చకు సర్కార్ పారిపోతోంది. సాగునీరు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. రూ.15 వేల రైతు భరోసా ఇప్పటికీ ఇవ్వలేదు. రైతులు రోడ్ల మీదకెక్కి ప్రశ్నిస్తున్నారు. కరెంట్ సమస్య వల్ల మోటార్లు కాలిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఆర్టీసీ ప్రైవేటీకరణపై సభలో చర్చ జరగాలి’ అని పేర్కొన్నారు.