AP: తిరుపతి తొక్కిసలాట ఘటనపై న్యాయవిచారణ కొనసాగుతోంది. హైకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్ సత్యనారాయణమూర్తి ఈ విచారణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో న్యాయవిచారణకు టీటీడీ ఈవో శ్యామలరావు హాజరయ్యారు. కాగా, జనవరి 8న జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందగా 40 మంది గాయపడ్డారు.