ATP: అనంతపురం జేఎన్టీయూలోని ఎంటెక్, ఎంసీఏ 1వ సంవత్సరం విద్యార్థులకు నాలుగు రోజులపాటు నిర్వహించిన ఆప్టిట్యూడ్ & రీజనింగ్ ట్రైనింగ్ కార్యక్రమం సోమవారంతో ముగిసింది. ఈ సందర్బంగా ప్రిన్సిపల్ పి. చెన్నారెడ్డి మాట్లాడుతూ.. ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ వలన విద్యార్థులకు అనేక ఉద్యోగావకాశాలు ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో TPO జె. శ్రీనివాసులు, విద్యార్థులు పాల్గొన్నారు.