BDK: పినపాక మండలం వెంకట్రావుపేట గ్రామంలో ఇటీవల 76 క్వింటాల మిర్చి కల్లాన్ని తగలబెట్టిన ఇద్దరు నిందితులను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. వ్యక్తిగత వివాదాల నేపథ్యంలో మిర్చి కల్లాన్ని తగలబెట్టినట్లు ఎస్ఐ రాజ్ కుమార్ వివరాలు వెల్లడించారు. నిందితులపై కేసు నమోదు చేసి డిమాండ్‌కు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు.