HNK: వివిధ సమస్యలపై ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులు త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ పి. ప్రావీణ్య ఆదేశించారు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వివిధ సమస్యల పరిష్కారానికై 76 ఆర్జీలు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. సమస్యలను పెండింగ్ లేకుండా త్వరగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు.