ATP: అనంతపురంలోని పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా ఎస్పీ జగదీష్ పాల్గొని జిల్లా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వారితో మాట్లాడి సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. చట్టపరిధిలో సమస్యలకు పరిష్కారం చూపుతామని ప్రజలకు ఎస్పీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 82 అర్జీలు స్వీకరించినట్లు ఎస్పీ తెలిపారు.