CTR: చేనేత, మరమగ్గ కార్మికులకు ఉచిత విద్యుత్‌కు కాబినెట్ ఆమోదం తెలపడంతో నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ హర్షం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. చేనేత కార్మికులకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్‌కు 500 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ ఇస్తుందన్నారు. ఎన్నో సంవత్సరాలు నుంచి ఎదురుచూస్తున్న నగరి, పుత్తూరులోని చేనేత, మరమగ్గ కార్మికుల కల నెరవేరిందన్నారు.