కోనసీమ: స్వచ్ఛ మండపేట ఉద్యమంలో ప్రజలు భాగస్వాములు కావాలని మండపేట మున్సిపల్ కమిషనర్ టీవీ రంగారావు శుక్రవారం పిలుపునిచ్చారు. మండపేటలో ఆయన మాట్లాడుతూ.. పట్టణ ప్రజలు పన్నులు వెంటనే చెల్లించడం ద్వారా పట్టణ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకంపై నిరంతరం దాడులు చేసి భారీగా జరిమానా విధించాలని శానిటేషన్ సిబ్బందిని ఆదేశించారు.